కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (19-07-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో ఆదివారం (19-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 19th july 2020

1. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో భారీగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క రోజులోనే కొత్త‌గా 5041 కేసులు వ‌చ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,650కు చేరుకుంది. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో కేవ‌లం తూర్పు గోదావ‌రిలోనే కొత్త‌గా 647 కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా 26,118 మంది చికిత్స పొందుతున్నారు. 22,890 మంది కోలుకోగా, మొత్తం 642 మంది చ‌నిపోయారు.

2. ఒక్కసారి క‌రోనా బారిన ప‌డి కోలుకున్నాక‌.. 3 నెల‌ల్లోగా శ‌రీరంలో ఉండే రోగ నిరోధ‌క‌త పోతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. కింగ్స్ కాలేజ్ లండ‌న్‌కు చెందిన ప‌రిశోధ‌కులు తాజాగా కోవిడ్ నుంచి కోలుకున్న వారిపై ప‌రిశోధ‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలో తేలిందేమిటంటే.. కోవిడ్ నుంచి కోలుకున్న త‌రువాత దాదాపుగా 3 నెల‌ల వ‌ర‌కు వారిలో కోవిడ్ యాంటీ బాడీలు అలాగే ఉన్నాయ‌ని, 3 నెల‌ల త‌రువాత అవి త‌గ్గాయ‌ని, అంటే కోవిడ్ ప‌ట్ల వారు రోగ నిరోధ‌క‌త (ఇమ్యూనిటీ)ని కోల్పోయార‌ని అన్నారు.

3. ఏపీలో సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమ‌వుతోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. అయితే మొదట ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభిస్తామని కేంద్రానికి తెలిపిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలను ప్రారంభించనున్నట్టు వివరించింది.

4. కోవిడ్-19 వైరస్ ను ఇప్పుడు ఆరు రకాలుగా వర్గీకరించారు. బ్రిటన్ లోని కింగ్స్ కాలేజీ, లండన్ శాస్త్రవేత్తలు మార్చి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో కరోనా బారిన పడిన 1600 మంది రోగులకు బయటపడిన లక్షణాలను ఎప్పటికప్పుడు సేకరించి ప్రత్యేక అల్గారిథంతో విశ్లేషించి వర్గీకరించారు. జ్వరం, జీర్ణ కోశ సమస్యలు, తీవ్ర ఇన్ఫెక్షన్ తోపాటు గందరగోళం, కడుపు నొప్పి, శ్వాస సమస్య అనే ఆరు విభాగాలుగా విభజించారు.

5. అక్టోబ‌ర్ వ‌ర‌కు భార‌త్‌లో ప‌రిస్థితిని బ‌ట్టి బీసీసీఐ ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌పై నిర్ణ‌యం తీసుకోనుంది. ప‌రిస్థితి మెరుగు ప‌డితే భార‌త్‌లోనే ఐపీఎల్ జ‌రుగుతుంది. లేదా దుబాయ్‌లో ఈ టోర్నీని నిర్వ‌హిస్తారు. ఈ విష‌యంపై బీసీసీఐ చాలా స్ప‌ష్ట‌త‌తో ఉంది. సోమ‌వారం ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌పై త‌న నిర్ణ‌యాన్ని వెలువ‌రించే అవ‌కాశం ఉంది.

6. గడిచిన 24 గంటల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 38,902 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,77,618కి చేరింది. ఒక్క రోజులో దేశంలో 543 మంది చనిపోయారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 26,816కి చేరింది. మొత్తం 6,77,423 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,73,379 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

7. గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ‌లో కొత్త‌గా 1296 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,076కు చేరుకుంది. మొత్తం 415 మంది చ‌నిపోయారు. 32,438 మంది కోలుకున్నారు. 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

8. ప్రధాని మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. కోవిడ్ కట్టడి చర్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మోదీ తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలతోనూ ఫోన్‌లో మాట్లాడారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్‌తో ప్రధాని మాట్లాడి.. ఆయా రాష్ట్రాల్లో వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు.

9. పాకిస్థాన్‌లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో కొత్తగా 1,579 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 46 మంది మృతి చెందారు. అక్క‌డ‌ ఇప్పటివరకు మొత్తం 2,63,496 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 5,568 మంది మృతి చెందారు.

10. శ‌నివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2,59,848 పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. కేవలం అమెరికాలోనే 24 గంటల్లో 71,484 కొత్త‌ పాజిటివ్‌ కేసులు నమోద‌య్యాయి. బ్రెజిల్‌లో 45వేలు, దక్షిణాఫ్రికాలో 13వేల కేసులు నమోద‌య్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news