కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (27-07-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో సోమ‌‌‌వారం (27-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 27th july 2020

1. దేశీయ ఫార్మా దిగ్గ‌జ సంస్థ భార‌త్ బ‌యోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్‌ను గాను మ‌రో చోట క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభ‌మ‌య్యాయి. ఒడిశాలోని ఎస్‌యూఎం హాస్పిట‌ల్‌లో వ్యాక్సిన్‌కు ట్ర‌య‌ల్స్‌ను సోమ‌వారం ప్రారంభించారు. ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చి (ఐసీఎంఆర్‌) దేశ‌వ్యాప్తంగా మొత్తం 12 చోట్ల కోవ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ ను చేప‌ట్టింది. అందులో భాగంగానే ఒక్కో చోట నెమ్మ‌దిగా ట్ర‌య‌ల్స్ ప్రారంభ‌మ‌వుతున్నాయి.

2. ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 6051 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,349కు చేరుకుంది. మొత్తం 1090 మంది మృతి చెందారు. 46,681 మంది కోలుకున్నారు. 51,683 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

3. కరోనా పరీక్షల‌ను మ‌రింత వేగంగా నిర్వహించేందుకు గాను 3 నగరాల్లో ఐసీఎంఆర్​ ఏర్పాటు చేసిన టెస్టింగ్ కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోదీ సోమ‌వారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దాదాపుగా 1300 టెస్టింగ్​ కేంద్రాలు ఉన్నాయని, రోజుకు 5లక్షలకుపైగా నమూనాల‌ను పరీక్షిస్తున్నార‌ని మోదీ తెలిపారు.

4. ప్ర‌యివేటు హాస్పిట‌ల్స్‌లో కరోనా చికిత్స తీసుకునే రోగుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం షాకిచ్చింది. వారు ఇన్సూరెన్స్ లేదా ఇత‌ర ఏ స‌దుపాయం కింద‌నైనా హాస్పిట‌ళ్ల‌లో కోవిడ్ చికిత్స తీసుకుంటే వారికి ప్ర‌భుత్వం నిర్దేశించిన కోవిడ్ చికిత్స రేట్లు వ‌ర్తించ‌వ‌ని తెలిపింది. అందువ‌ల్ల వారు ఆ రేట్ల‌తో నేరుగా డ‌బ్బులు చెల్లించి చికిత్స పొందాల్సి ఉంటుంది.

5. క‌రోనా వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయిన వారి మృత‌దేహాల‌తో గుంటూరు జిల్లా జీజీహెచ్ నిండిపోయింది. మృతదేహాల‌ను తీసుకువెళ్లేందుకు ఎవ‌రూ రాక‌పోవ‌డంతో అవి హాస్పిట‌ల్‌లోనే పేరుకుపోతున్నాయి. అలాగే మృత‌దేహాల అప్ప‌గింత ప్ర‌క్రియ కూడా ఆల‌స్యం అవుతోంది. దీంతో మృత‌దేహాలు గుట్ట‌లుగా పేరుకుంటున్నాయి.

6. ప్రైవేటు ల్యాబ్‌ల‌లో క‌రోనా ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టులు చేస్తే రూ.750కు మించి తీసుకోకూడ‌ద‌ని ఏపీ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేవ‌లం ఐసీఎంఆర్ అనుమ‌తి ఉన్న ల్యాబ్‌ల‌లోనే ప‌రీక్ష‌లు చేయాల‌న్నారు. అదే వీఆర్‌డీఎల్ ప‌రీక్ష అయితే రూ.2800 వ‌ర‌కు తీసుకోవ‌చ్చ‌ని సూచించింది.

7. తెలంగాణ‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1473 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 55,532కు చేరుకుంది. మొత్తం 471 మంది చ‌నిపోయారు. 12,955 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం 42,106 మంది రిక‌వ‌రీ అయ్యారు.

8. అమెరికాలో అక్క‌డి ఫార్మా కంపెనీ మోడెర్నా చేప‌ట్టిన క‌రోనా వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చివ‌రి ద‌శకు చేరుకున్నాయి. దీంతో ట్రంప్ ప్ర‌భుత్వం వ్యాక్సిన్ డోసుల‌కు గాను మొత్తం 1 బిలియ‌న్ డాల‌ర్ల‌ను ఆ కంపెనీకి అందివ్వ‌నున్న‌ట్లు తెలిపారు. చివ‌రి ద‌శ‌లో 15 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చి ట్ర‌య‌ల్స్ చేప‌ట్ట‌నున్నారు.

9. లాక్‌డౌన్ కార‌ణంగా త‌మిళ‌నాడులో అవాంఛిత గ‌ర్భాలు ఎక్కువ‌గా పెరిగాయి. దీనికి తోడు అక్క‌డ గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల కొర‌త ఏర్ప‌డింది. ఫ‌లితంగా 1.24 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు అవాంఛిత గ‌ర్భంతో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిసింది.

10. శ‌రీరంలో విట‌మిన్ డి స్థాయిలు త‌క్కువ‌గా ఉంటే క‌రోనా వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని ఇజ్రాయెల్ సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. విట‌మిన్ డి ఎక్కువ‌గా ఉంటే కరోనా వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని చెప్పారు. ఈ మేర‌కు వారు ప‌లువురు కోవిడ్ పేషెంట్ల‌లో విట‌మిన్ డి స్థాయిల‌ను ప‌రీక్షించి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news