కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో శుక్రవారం (07-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,171 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,06,960కి చేరుకుంది. 84,654 యాక్టివ్ కేసులు ఉండగా, 1,20,464 మంది కోలుకున్నారు. 1842 మంది చనిపోయారు.
2. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,207 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 75,257కు చేరుకుంది. 21,417 మంది చికిత్స పొందుతుండగా, 53,239 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 601 మంది చనిపోయారు.
3. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,538 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో మొత్తం కేసుల సంఖ్య 20,27,075కు చేరుకుంది. 6,07,384 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 13,78,106 మంది కోలుకున్నారు. 41,585 మంది చనిపోయారు.
4. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ తన సంస్థ ఉద్యోగులకు వచ్చే ఏడాది జూలై వరకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటి వద్ద ఉండి పనిచేసే ఉద్యోగులకు ఆఫీసు ఖర్చుల నిమిత్తం 1000 డాలర్లను అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
5. అమెరికాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 58వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 2060 మంది చనిపోయారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50,32,179కు చేరుకుంది. 22,92,707 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 25,76,668 మంది కోలుకున్నారు. 1.60 లక్షల మంది వరకు చనిపోయారు.
6. కరోనా నేపథ్యంలో అక్టోబర్ 15 నుంచి ఏపీలో కాలేజీలను తెరవనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం జగన్ ఉన్నత స్థాయి విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిస్థితులకు అనుగుణంగా కాలేజీలను ఓపెన్ చేయాలన్నారు.
7. రష్యాలో ఆగస్టు 10వ తేదీన కరోనా వ్యాక్సిన్‌ను ప్రజా పంపిణీ కోసం విడుదల చేయనున్నారు. ఇప్పటికే అక్కడి గమాలయా ఇనిస్టిట్యూట్ కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేయగా.. దానికి గాను క్లినికల్ ట్రయల్స్‌ను తాజాగా పూర్తి చేశారు. దీంతో అక్కడ కరోనా వ్యాక్సిన్‌ను లాంచ్ చేయనున్నారు.
8. కరోనా బారిన పడి కోలుకున్న వారు ఎమర్జెన్సీ స్థితిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావాలని ప్రముఖ నటుడు చిరంజీవి కోరారు. ఈ మేరకు ఆయన సైబరాబాద్ కమిషనరేట్‌లో ప్లాస్మా డోనార్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
9. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతుండడంపై రాహుల్ గాంధీ మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా బాధితుల సంఖ్య 20 లక్షలు దాటినా మోదీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని అన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే మోదీకి కనిపించడం లేదా అన్నారు.
10. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కోవిడ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆ వ్యాక్సిన్‌ను మన దేశ ప్రజలకు ఒక్క డోసును కేవలం రూ.225కే అందించనున్నట్లు తెలిపింది. భారత్ కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ 100 మిలియన్ల డోసులను ఆరంభంలో సిద్ధం చేయనుంది.