దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఓమిక్రాన్ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గతంలో 10వేల కన్నా దిగువగా ఉండే కేసులు ప్రస్తుతం 30 వేలకు పైగానే నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. జనాలు కరోనా నిబంధనలు పాటించేలా హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వాలు.
తాజాగా కరోనా ప్రభావం న్యాయ వ్యవస్థపై కూడా పడుతోంది. కరోనా వ్యాప్తి కారణంగా తెలంగాణ హైకోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్ట్ లో ప్రత్యక్ష విచారణ నిలిపివేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్న తరుణంలో హైకోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రత్యక్ష విచారణ లేదా ఆన్ లైన్ విచారణలపై జడ్జిలకు విచక్షణ అధికారాలు ఇచ్చారు. అయితే ఒక వేళ ప్రత్యక్ష విచారణ జరిపాలని జడ్జి నిర్ణయిస్తే… కోవిడ్ రూల్స్ ని తప్పకుండా పాటించాలని హైకోర్ట్ తెలిపింది.