యూరప్ లో కరోనా కల్లోలం.. పలు దేశాల్లో మళ్లీ లాక్ డౌన్లు…!

-

యూరోపియన్ దేశాలపై కరోనా మేఘాలు మళ్లీ కమ్ముకొస్తున్నాయి. పలు దేశాల్లో కరోనా కల్లోలం మొదలైంది. పలు దేశాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా గత వారం నుంచి నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే సగాని కన్నా ఎక్కువ కేసులు యూరప్ దేశాల్లోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థపై కరోనా పంజా విసిరేలా ఉందని పలు దేశాల ప్రభుత్వాలు, కంపెనీలు భయపడుతున్నాయి. జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, బ్రిటన్, ప్రాన్స్ వంటి దేశాలు కరోనాను అడ్డుకునేందకు చర్యలు చేపట్టాయి. నెదర్లాండ్ లో మూడు వారాల పాటు పాక్షికంగా లాక్ డౌన్ ను ప్రకటించారు.

COVID

ఇవే కాకుండా లాత్వియా, స్లోవేకియా వంటి దేశాల్లో కూడా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మరో నెలలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇది యూరప్ దేశాలను మరింతగా భయపెడుతోంది. పెద్ద ఎత్తున జనాలు కూడితే వ్యాధి వ్యాప్తి ఎక్కువగా పెరుగుతుందని భయపడుతున్నాయి.  WHO ప్రకారం 2022 ఫిబ్రవరి వరకు యూరప్ లో 5 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చిరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news