వణుకుతున్న యూరప్… పెరుగుతున్న కరోనా కేసులు

-

కరోనా థర్డ్ వేవ్ మొదలైందా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి యూరప్ పరిస్థితి చూస్తుంటే. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో యూరప్ వణికిపోతోంది. ప్రపంచంలో నమోదవుతున్న అన్ని కేసుల్లో సగం కేసులు యూరప్ దేశాల్లోనే నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత వారం వ్యవధిలో యూరప్ దేశాల్లో 20 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. వారంతో ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే మొదటి సారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చే సింది. యూరప్‌లోని తాజా పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ ట్రెడోస్‌ అధానోమ్‌ కూడా స్పందించా రు. జెనీవాలో ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ ఐరోపాలో వ్యాక్సి నేషన్‌ రేటు అధికంగా ఉన్న ఫ్రాన్స్‌, బెల్జియం తదితర దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయన్నారు. ఇది మరొక హెచ్చరిక అని ఆయన తెలిపారు.

గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌ఓ) యూరప్ లో కరోనా కేసుల గురించి స్పందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు మొత్తం యూరప్ లో దాదాపు 5 లక్షల మరణాలు సంభవించవచ్చని అంచానా వేసింది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news