ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పలు దేశాలను కలవరపెడుతున్నాయి. అయితే ఇండియాలో మాత్రం సగటున రోజుకు 10 కన్నా తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఓమిక్రాన్ కూడా ముంచుకోస్తున్న వేళ దేశంలో తక్కువ కేసులు నమోదవడం సంతోషం కలిగించే విషయం. కరోనా పట్ల జనాలకు అవగాహన రావడం, వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా అందరి ప్రజలకు అందుబాటులోకి రావడంతో కోవిడ్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి.
తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో 8,954 కేసులు నమోదయ్యాయి. 267 మరణాలు నమోదయ్యాయి. 24 గంటల్లో వ్యాధి నుంచి 10,207 మంది రికవరీ అయ్యారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 99,023 గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది. నిన్న 551 రోజుల్లో అత్యంత కనిష్ట స్థాయికి కేసులు చేరాయి. కేవలం 6990 కేసులు మాత్రమే నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది.
ఇండియాలో కేసుల వివరాలు—
మొత్తం కరోనా కేసులు- 3,45,96,776
మరణాలు- 4,69,247
యాక్టివ్ కేసులు-99,023
కరోనా వ్యాక్సినేషన్ డోసులు- 124,10,86,850