కరోనా సోకిన తర్వాత ఏ ఆహారం తీసుకోవాలనే దానిపై విపరీతమైన చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏ ఆహారాలు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో ఆహారాన్ని చూపిస్తూ కోవిడ్ రోగులకి మంచివని చెబుతున్నారు. పోషకాహార నిపుణుల ప్రకారం కిచిడి చాలా మేలు చేస్తుందని తెలుస్తుంది. చాలా ఇళ్ళలో కిచిడి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ, కిచిడిలో చాలా ఆరోగ్యం దాగుందని, ఆహారంలో దాన్ని బాగుచేసుకోవడం ఆరోగ్యకరమని చెబుతున్నారు.
బియ్యంతో వండిన అన్నంతో చేసిన కిచిడినే కాకుండా చిరుధాన్యాలతో చేసిన కిచిడి చేసుకున్నా బాగుంటుంది. అలాగే అన్నం, కిచిడిలకే పరిమితం కాకుండా మిగతా ఆహారాలను తీసుకోవాలని సూచిస్తున్నారు.
కోవిడ్ రోగులు ఏ ఆహారాలను తీసుకోవాలి
రోగుల శరీర ధర్మాన్ని బట్టి రంగు రంగుల కూరగాయలు, బియ్యం, విభిన్న ధాన్యాల రొట్టెలు తీసుకోవడం ఉత్తమం. తీసుకునే ఆహారంలో కావాల్సిన కొవ్వులు, పీచుపదార్థాలు, విటమిన్లు ఉండేలా చూసుకోండి.
యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆహారాలను భాగం చేసుకోండి. బంగాళదుంప, సెరీల్ వంటి వాటిని తీసుకోవడమూ ఉత్తమమే. మరో ముఖ్య విషయం, ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినండి. పరిశుభ్రమైన ప్రదేశంలో స్వఛ్ఛమైన ఆహారాన్ని తీసుకుంటే బాగుంటుంది. ద్రవపదార్థాలు ఎక్కువశాతం తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
ఒకవేళ కడుపు నొప్పిగా ఉన్నట్లయితే కూరగాయల కిచిడి, సాంబర్ అన్నం, పెరుగన్నం, సూప్ మంచి ఆప్షన్స్. చిరుతిళ్ళు, ఫ్రై చేసిన ఆహారాలు, చక్కెర ఎక్కువ కలిగిన కూల్ డ్రింక్స్ తీసుకోకపోవడం చాలా ఉత్తమం.
సో కరోనాతో ఇబ్బంది పడుతున్నవారు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకున్నారు కదా.