ఆక్సీజన్ సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగగా.. ఈ సందర్భంగా హైకోర్ట్ ధర్మాసనం… 700 మెట్రిక్ టన్నులు ఢిల్లీకి సరఫరా చేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది అని అలా చేయకపోతే కొర్టు ధిక్కరణ కిందికి వస్తుందని హెచ్చరించింది. ట్యాంకర్లు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సరఫరా చేయడం లేదని కేంద్రం పై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
విచారణ సందర్భంగా కేంద్రానికి ఢిల్లీ హై కోర్టు చురకలు అంటించింది. ఆక్సిజన్ ట్యాంకర్ల నిర్వహణను ఐఐటి లేదా ఐఐఎంకు అప్పగిస్తే కేంద్రం కన్నా వారు మెరుగ్గా పనిచేస్తారు అని వ్యాఖ్యానిస్తూ ఈ రోజు దేశం మొత్తం ఆక్సిజన్ కోసం ఏడుస్తోంది అని మండిపడింది. ఆక్సిజన్ సరఫరాపై కోసం ఐఐఎంల నిపుణులు, తెలివైన వారి సేవలను వినియోగించుకోవాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు సూచనలు చేసింది.