పిల్లలకు చదువుతోపాటు విలువలు కూడా నేర్పించాలి : సీపీ పీవీ ఆనంద్‌

-

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో శనివారం నిర్వహించిన అన్వల్ ఇన్వెస్టిటర్ సెలెబ్రేషన్స్ లో సీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ… విద్యార్థులు తలుచుకుంటే సాధించలేనిదేమీ ఉండదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు సీవీ ఆనంద్.

Hyderabad: 69 మంది సీఐలపై బదిలీ వేటు.. సీఐ నాగేశ్వర్‌రావు ఇష్యూ​ తర్వాత  సీరియస్​ చర్య‌లు | Prabha News

పిల్లలకు చదువుతోపాటు విలువలు కూడా నేర్పించాలని చెప్పారు సీవీ ఆనంద్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకోవడం గొప్ప అవకాశమన్న సీవీ ఆనంద్… ఈ స్కూల్ లో చదివిన ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదగారన్నారు. స్కూల్ లో నిర్వహించే ప్రతి యాక్టివిటీలో విద్యార్థులు తప్పకుండా పాల్గొనాలని సూచించారు సీవీ ఆనంద్. అప్పుడే వారిలో ఉండే ప్రతిభా పాటవాలు బయటపడుతాయని తెలిపారు సీవీ ఆనంద్. తనకు చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలనే కోరిక ఉండేదన్న ఆయన… ఇవాళ తాను ఓ పోలీసు అధికారిగా విధులు నిర్వర్తించడం ఆనందంగా ఉందన్నారు సీవీ ఆనంద్.

 

Read more RELATED
Recommended to you

Latest news