3 ప్లాటున్ల కేంద్ర బలగాలను దింపాం : సీపీ జోయల్ డేవిస్

ఎన్నికల నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నామని నిన్న సిద్ధిపేటలో బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన సీపీ జోయల్ డేవిస్ అన్నారు. 3 ప్లాటున్ల కేంద్ర బలగాలను రప్పించామన్న ఆయన పరిస్థితి ని బట్టి..ముందే బలగాలను దించామని అన్నారు. నిన్న ఏం జరిగింది అనేది ఎన్నికల కమిషన్ కి…డిజీపీ కి నివేదిక పంపించానని ఆయన అన్నారు. నిన్న ఎన్నికల అధికారుల మీద దాడి చేసి డబ్బులు లాక్కెళ్లిన కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని వీడియో ఆధారాలు సేకరించి రిమాండ్ తరలిస్తామని అన్నారు.

నా పై ఫిర్యాదు చేసినా ఎన్నికల కమిషన్ ఏం జరిగింది అనే నివేదిక అడుగుతారు కదా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఏ పార్టీ ఫిర్యాదు చేసినా తనిఖీలు చేశామన్న అయన పోలీసుల మీద నమ్మకం లేకపోతే…జిల్లా కలెక్టర్..ఎన్నికల పరిశీలకులకు కూడా ఫిర్యాదు చేయొచ్చని అన్నారు. బీజేపీ అభ్యర్థి మీద నిన్నటి ఘటనలో ఎలాంటి కేసు నమోదు చేయలేదన్న ఆయన ఆరోపణలు సహజం కదా అని ప్రశ్నించారు. మేము ప్రభుత్వం కింద కాదు… ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నామని అయన అన్నారు. మాపై ఫిర్యాదు చేసిన వాళ్ళ తనిఖీల్లో చాలా చోట్ల డబ్బులు దొరకలేదని అయన అన్నారు.