బండి సంజయ్ ఆరోపణలపై కమిషనర్ రెస్పాండ్ !

-

తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పేపర్ ను లీక్ చేశారన్న అభియోగంపై కరీంనగర్ ఎంపీ మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ మీద విడుదల చేసిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ బయటకు వచ్చిన తర్వాత వరంగల్ పోలీస్ కమిషనేర్ రంగనాధ్ పైన చేసిన వ్యాఖ్యలు రెండు రోజుల నుండి వైరల్ గా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా రంగనాధ్ స్పందించడం విశేషం. రంగనాధ్ మాట్లాడుతూ నా గురించి సెటిల్మెంట్ చేశానని మాట్లాడుతున్నారు, ఈ కామెంట్ పైన నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదన్నారు. బండి సంజయ్ చెప్పినట్లు నేను సెటిల్మెంట్ చేసినట్లు ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తానని సవాలు విసిరాడు.

ఇప్పటి వరకు నా సర్వీస్ లో ఎక్కడా సెటిల్మెంట్ లు చేయలేదు, రాజకీయ పార్టీలకు అతీతంగా నేను పనిచేస్తూ వచ్చానని రంగనాధ్ తెలిపారు. మరి రంగనాధ్ చెప్పినట్లు బండి ఏమైనా రుజువులు చూపిస్తాడా చూడాలి ?

 

Read more RELATED
Recommended to you

Latest news