ఉప‌పోరులో గులాబీకి మ‌ద్ద‌తుపై సీపీఐ మ‌డ‌తేసింది..!

-

క‌మ్యూనిస్టులు ముందుగా ఆవేశంతో నిర్ణ‌యాలు తీసుకుంటారు.. త‌రువాత నాలుక మ‌డ‌తేసి ఏదో అల‌వాట్ల పొర‌పాటు అంటారు.. ఆపై చారిత్ర‌త్మాక త‌ప్పిదం అని కూడా త‌మ‌కు తామే త‌మాయించుకుంటారు.. ఇది క‌మ్యూనిస్టులు చేసే ప‌నిలో నిత్యం జ‌రిగేదే.. ఇప్పుడు హుజూర్‌న‌గ‌ర్ ఉప పోరులోనూ అదే జ‌రిగింది. క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నేత‌లు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. ముందుగా హుజూర్‌న‌గ‌ర్ ఉప పోరులో తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఆ పార్టీ రాష్ట్ర కార్యాద‌ర్శి చాడా వెంక‌ట్‌రెడ్డి. వారం తిరిగే స‌రికి ఇప్పుడు అబ్బే టీఆర్ఎస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేదు అంటూ ప్ర‌క‌టించారు.

వాస్త‌వానికి ఆర్టీసీ స‌మ్మెను సాకుగా చూపి టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు సీపీఐ ప్ర‌క‌టించింది. టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తును సీపీఐ ఉప సంహ‌రించుకోవ‌డంతో హుజూర్‌న‌గ‌ర్ ఎన్నిక ర‌స‌కందాయంలో ప‌డింది.. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో రోజుకో పరిణామం అసక్తి, ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇప్పుడు  సిపిఐ పార్టీ తీసుకున్న యూ టర్న్ కాంగ్రెస్‌కు మంచి ఉత్సాహం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానమైన హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో బై ఎలక్షన్ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే..గత డిసెంబ‌ర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజెఎస్ పార్టీల్లో టిడిపి ఈసారి సొంతంగా బరిలోకి అభ్యర్థిని దింపింది. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు సిపిఐ మద్దతు కోరగా.. సిపిఐ నేతలు గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఈలోగా ఆర్టీసీ సమ్మె రావడంతో సిపిఐ పార్టీపై కార్మికులు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కార్మిక సంఘాలకు ప్రతినిధిగా చెప్పుకునే కామ్రేడ్లు ఒకింత ఇరకాటంలో పడి.. తీరా యూ టర్న్ తీసుకున్నారు.

ఆదిలాబాద్లో ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న చాడా వెంకట్ రెడ్డి హుజూర్ నగర్లో టిఆర్ఎస్  పార్టీ అభ్యర్థికిచ్చిన మద్దతు ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. కానీ ఏ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని మాత్రం ప్ర‌క‌టించ‌లేదు.. మ‌రి రాబోవు రోజుల్లో సీపీఐ ఏ రూట్‌లో వెళ్ళ‌నుందో తేలిపోనుంది. ఇక హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నికకు మ‌రో వారం రోజులే గ‌ట్టిగా గ‌డువు ఉంది. ఈ టైంలో సీపీఐ ఇచ్చిన షాక్‌తో గులాబీ ద‌ళానికి కోలుకోలేని దెబ్బ ప‌డిన‌ట్ల‌య్యింది.

Read more RELATED
Recommended to you

Latest news