జియో నుంచి మరో అదిరిపోయే ఆఫ‌ర్‌.. మ‌రో ఏడు రోజులు మాత్రమే!

-

తక్కువ కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకున్న రిలయన్స్ జియో ఇటీవ‌ల ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా క‌స్ట‌మ‌ర్ల‌కు ఓ గుడ్ న్యూస్ తెలియ‌జేసింది. 30 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది.

ఈ మేరకు ‘ఎకనమిక్ టైమ్స్’ దినపత్రిక పేర్కొంది. ఖాతాదారులను కోల్పోకూడదన్న ఉద్దేశంతోనే జియో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. తొలిసారి రీచార్జ్ చేయించుకున్న ఖాతాదారులకు 30 నిమిషాల ఉచిత టాక్‌టైం ఇవ్వనున్నట్టు జియో పేర్కొంది. రీచార్జ్ ప్లాన్లు ప్రకటించిన తొలి వారం రోజులు మాత్రమే ఈ వన్-టైమ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news