నేడు ఉద్యోగ సంఘాలతో మరోసారి ఏపీ మంత్రుల కమిటీ భేటీ

-

సీపీఎస్‌పై చర్చించడానికి ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ మరోసారి భేటీ కానుంది. ఈ మేరకు 20 మంది ప్రతినిధులకు ఆహ్వానం పంపింది. నేడు సాయంత్రం 4 గంటలకు ఈ చర్చలు జరగనున్నాయి. అయితే నిన్న జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగియడం గమనార్హం.

పాత పింఛన్‌పై మాట్లాడదామంటేనే తాము వచ్చామని మంత్రులతో సమావేశంలో స్పష్టంచేసినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. జీపీఎస్‌ గురించి మాట్లాడాలనుకుంటే ఇకపై అసలు చర్చలకు పిలవొద్దని తేల్చి చెప్పినట్టు వెల్లడించారు.

’’ మేం పాత పింఛనుపై మాట్లాడదామంటే మీరు జీపీఎస్‌ ట్రాక్‌లోకి రండి.. దానికి మేం కొంత వెసులుబాట్లకు సిద్ధమేనని మంత్రులు చెప్పారు. కానీ,పాత పింఛను విధానంలోకి వస్తే ఒకట్రెండు వెసులుబాట్లకు మేం సిద్ధమేనని చెప్పాం. ప్రభుత్వం తరఫు నుంచి పాత పింఛను విధానానికి వచ్చే అవకాశం ఇసుమంత కూడా లేదని మంత్రులు చెప్పారు. మరి ఆమాత్రం దానికి ఎందుకు ప్రతిసారీ చర్చలకు పిలవడం దేనికి.. ఇది కరెక్టు కాదని చెప్పాం’’ అని ఏపీసీపీఎస్‌యూఎస్‌ అధ్యక్షుడు మరియదాస్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news