మరోసారి తండ్రైన ఇండియన్ స్టార్ క్రికెటర్

-

ఇండియన్ క్రికెట్ సీనియర్ స్టార్ ప్లేయర్ అజింక్యా రహానే మరోసారి తండ్రయ్యాడు. రహానే భార్య రాధిక బుధవారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రహానే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు. రాధిక, ఆమె కుమారుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని రహానే చెప్పాడు. తల్లీబిడ్డను దీవించి తమ ఆశీస్సులు అందించిన తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా రహానే సోషల్ మీడియాలో అభిమానుల కోసం ప్రత్యేక లేఖను కూడా షేర్ చేశాడు.

“ఈ ఉదయం రాధిక, నేను.. నా బాబిని ఈ ప్రపంచంలోకి స్వాగతించాము. రాధిక, బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నారు. మీ అందరీ ప్రార్థనలకు మేము ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని రహీనే తన లేఖలో రాసుకొచ్చాడు.

అజింక్యా రహానే సెప్టెంబర్ 2014లో రాధికను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం మరాఠీ సంప్రదాయాలతో పూర్తయింది. రహానే, రాధిక చిన్ననాటి స్నేహితులు. 2019లో రాధిక ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమె పేరు ఆర్య.

Read more RELATED
Recommended to you

Latest news