విజయ్ సేతుపతి-సమంత పాటకు చెన్నై ఆటగాళ్ల చిందులు..వీడియో వైరల్

-

కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్(KRK)’. ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ ట్రైయాంగిల్ లవ్ స్టోరి. ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా నయనతార, సమంత నటించారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. ఈ పిక్చర్ నుంచి విడుదలైన ‘టు టు టు టు’ సాంగ్ కు విజయ్ సేతుపతి, సమంత, నయనతార స్టె్ప్పులు చాలా బాగున్నాయి. కాగా, ఈ పాట క్రికెటర్స్ కూ నచ్చేసింది. తాజాగా ఈ పాటకు ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే క్రికెట్ ఆటగాళ్లు చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డేవిడ్ కాన్వే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. త్వరలో తన ప్రియురాలితో డేవిడ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకల్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ సభ్యులు పాల్గొని సందడి చేశారు.

కెప్టెన్ రవీంద్ర జడేజా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, డ్వేన్ బ్రావో, శివమ్ దూబే, మెయిన్ ఆలీ, మిచెన్ సాంట్నర్ హాజరయ్యారు. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం వీరు ‘టుటు టు’ పాటకు స్టెప్పులేశారు.

లుంగీలో క్రికెటర్లు సరదాగా చిందులేశారు. మహేంద్ర సింగ్ ధోని కూడా డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో చూసి సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ‘కాతు వాకుల రెండు కాదల్’ ఫిల్మ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ వీడియోను లైక్ చేయగా, సమంత షేర్ చేసి సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమా తెలుగులో ‘కణ్మణి రాంబో ఖతీజా’ టైటిల్ తో విడుదల కానుంది.

https://www.instagram.com/reel/CcsntbPFnRI/?utm_source=ig_embed&ig_rid=25ea6520-bbac-43e9-a926-a5ade1ed7a53

Read more RELATED
Recommended to you

Latest news