జగిత్యాలలో దారుణం.. భ‌ర్త‌ను బంధించి..భార్య‌పై లైంగిక దాడి !

-

భర్తను బంధించి..భార్యపై లైంగిక దాడికి ప్రయత్నించిన సంఘటన ఆదివారం రాత్రి జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లాలోని భీముని దుబ్బలో నివాసం ఉండే ఓ వ్యక్తి స్థానిక మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే… ఈ నెల 4 వ తేదీన ఓ పని మేరకు చినమెట్‌పల్లికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో మద్యం తాగి.. అక్కడే పడిపోయాడు.

ఈ విషయాన్ని గమనించిన కోరుట్లకు చెందిన ముగ్గురు యువకులు.. అతన్ని బ్లాక్‌ మెయిల్‌ చేశారు. అతని ఫోను తీసుకుని… అతడి భార్యకు ఫోన్‌ చేశారు. తమ కోరిక తీర్చితేనే తన భర్తను అప్పగిస్తామని ఆ యువకులు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. దీంతో అలర్ట్‌ అయిన ఆ యువతి.. ఇరుగుపోరుగు వారికీ ఈ విషయం చెప్పింది. మీరు చెప్పిన వద్దకే వస్తానని ఆ యువకులతో నమ్మబలికింది. వారు చెప్పిన చోటు ఆ యువతి వెళ్లగానే… ఆ ముగ్గురు యువకులు ఆమె లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో… ఇరుగు పొరుగు వారు ఆ యువకులకు దేహ శుద్ది చేసి.. పోలీసులకు అప్పగించారు. దీంతో కథ సుఖాంతం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news