రాజకీయాల్లో సినీ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ గ్లామర్ ఎంత ఉంటే పార్టీకి అంత కలిసి వస్తుంది. సినీ గ్లామర్ ఉంటే డబ్బులు ఇవ్వకుండానే ప్రజలు భారీగా సభలకు పరుగులు తీస్తారు. అందువల్లే సెలబ్రెటీలను స్టార్ క్యాపెయినర్లు గా ప్రకటిస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా నటి అర్చనా గౌతమ్ కు ఉత్తర ప్రదేశ్ లోని హస్తినాపుర ఎమ్మెల్యే టికెట్ ను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అర్చనా గౌతమ్ కు బికినీ గర్ల్ గా పాపులారిటీ ఉంది.
అంతే కాకుండా గ్రాండ్ మస్తీ సినిమాలో అందాల ప్రదర్శన తో రెచ్చిపోయింది. ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రచ్చ చేస్తు ఉంటుంది. అయితే అలాంటి నటికి టికెట్ ఇస్తారా అంటూ బీజేపీ ఫైర్ అవుతోంది. హస్తినాపుర ప్రజల మనో భావాలు దెబ్బతీశారంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా బీజేపీ నేత రాకేష్ త్రిపాఠి చౌకబారు ప్రచారం కోసమే అర్చనకు టికెట్ ఇచ్చారంటూ మండిపడ్డారు.ఇక మీ పార్టీలోనూ అలాంటి హీరోయిన్లు లేరా అంటూ కాంగ్రెస్ సైతం ఎదురు దాడి చేస్తోంది.