శ్రీకాకులంలో దారుణం..యువ‌తి అశ్లీల చిత్రాల‌ను అన్న‌కు పంపి..!

శ్రీకాకుంలం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కొత్త చెలికానివ‌ల‌స గ్రామానికి చెందిన ఓ యువ‌తి గ‌త నెల 30వ తేదీన ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అయితే ఆ యువ‌తి ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు కుటుంబ సభ్యుల‌కు తెలియ‌లేదు. దాంతో అంత్యక్రియ‌లు కూడా పూర్తిచేశారు. అయితే ఇంత‌లో యువ‌తి అన్న‌కు పొరుగు గ్రామైన రంగారాయపురానికి చెందిన హరీష్ అనే యువ‌కుడు ఆమెకు సంబంధించిన అశ్లీల చిత్రాల‌ను పంప‌డం క‌ల‌కలం రేపింది.crime

దాంతో యువ‌తిని వంచించి మోసం చేయ‌డం వ‌ల్లే ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నింధితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశాడు. ఇక కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు యువ‌తి మృత‌దేహానికి పోస్ట్ మార్టం నిర్వ‌హించారు. అయితే ఇంకా నింధితుడిని అదుపులోకి తీసుకోలేద‌ని కేసు విచార‌ణ త‌ర‌వాత అదుపులోకి తీసుకుంటామ‌ని చెబుతున్నారు. స్థానికంగా ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేప‌డంతో నింధితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని గ్రామ‌స్థులు డిమాండ్ చేస్తున్నారు.