కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుంది, బాడీ మంచిగా రీఫ్రెష్ అవుతుంది అని తెలుసు..కానీ కాఫీ పొడితో చర్మ సౌందర్యం కూడా పెంచుకోవచ్చు తెలుసా..ఫేస్ మీద ఉండే టాన్ పోతుంది. ఇంకా తరుచు కాఫీ పౌడర్ ఫేస్ మాస్క్ వేస్తుంటే..కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కలర్ అంటే బ్లాక్ కలర్ కాదులే..వైట్ కలర్ హే అండీ.. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మకణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్ పై పోరడటానికి సహాయపడతాయి.. ఇప్పుడు కాఫీ పొడితే ఏం ఏం చెయ్యొచ్చో చూద్దాం.
1. ఫేస్ పై టాన్ పోవాలంటే:
రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఒక స్పూన్ పెరుగు, రెండు నిమ్మరసం చుక్కలు, కొద్దిగా రోజ్ వాటర్..కుదిరితే టమాటో పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖం మీద..ముఖ్యంగా ఫోర్ హెడ్ పై టాన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా పట్టించి..అది అంతా డ్రై అయ్యే వరకూ ఉండి అంటే..దాదాపు 20 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా రబ్ చేస్తూ ఉండాలి. ఇలా బాగా రబ్ చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకుంటే..ముఖం పై టాన్ అంతా పోతుంది. తరచూ చేస్తుంటే ఫేస్ కూడా వైటనింగ్ గా మారుతూ వస్తుంది.
2. నల్లటివలయాలు:
కాఫీ పౌడర్ లో ఉండే కెఫిన్ డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్‌స్పూన్ కాఫీపౌడర్‌లో ఒక టీస్పూన్ తేనె, నాలుగైదు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్ వేసి కళ్ల కింద రాసి..ఓ పావుగంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే..కళ్లకింద నల్లటి వలయాలు ఇట్టే పోతాయి.
3. మొటిమలు
మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి కాఫీ పౌడర్ చక్కటి పరిష్కారం. మూడు టేబుల్‌స్పూన్ల కాఫీ పొడి, రెండు టేబుల్‌స్పూన్ల షుగర్, మూడు టేబుల్‌స్పూన్ల కొబ్బరినూనెను కలిపి మిశ్రమంలా చేసి ముఖం పై నెమ్మదిగా రబ్ చేయాలి. పది నిమిషాల తరువాత శుభ్రంగా కడగాలి. ఇలా చేస్తే మొటిమలు మటుమాయం అయిపోతాయట.
4. ముడతలు కూడా పోతాయట:
కాఫీ మాస్క్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల ఫేస్ పై ముడతలు, మచ్చలు తొలగిపోయి ఫేస్ గ్లోయింగ్ వస్తుంది. కాఫీ పౌడర్, కోకా పౌడర్‌ను ఒక బౌల్‌లో తీసుకుని కొద్దిగా పాలు పోసి పేస్టులా చేయాలి. తరువాత రెండు చుక్కల తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ఇరవై నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అంతే వారానికి ఓ సారి ఇలా చేస్తుంటే మంచి రిజల్ట్ వస్తుంది.
అయితే ఫేస్ కి ఏ ప్యాక్ వేసినా సరే..కనీసం 8-10 గంటల పాటు సోప్ కానీ, ఇతర ఫేస్ వాష్ లు పెట్టకుండా ఉండాలి. అప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈవినింగ్ లేదా నైట్స్ లో ఇలాంటి ప్యాక్స్ ట్రై చేశారంటే..ఎలాగో మార్నింగ్ కి 10 గంటలు అవుతాయి. అప్పుడు సోప్ పెట్టినా ప్రాబ్లమ్ ఉండదు. మీరు కూడా పై చిట్కాలలో మీకు సులవైంది ఏదో ట్రై చేసి చూడండి.