డ్రగ్స్ కేసు శాండల్‌వుడ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సినీ నటి రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బెంగళూరు కేంద్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు మంగళవారం నగరంలోని మాజీ మంత్రి, దివంగత జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా బంగ్లాపై దాడి చేయడం కలకలం రేపుతోంది.
ఈ కేసులో నిందితుడైన ఆదిత్య అల్వా సీసీబీ ఏజెంట్లు దాడుల ప్రారంభిన నాటి నుంచే కనిపించకుండా పోవడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిపై కేసులు నమోదు చేయగా, తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక సెర్చ్ వారెంట్ పొందిన తర్వాతనే హెబ్బాల్ సమీపంలోని ఆదిత్య అల్వా ‘హౌస్ ఆఫ్ లైఫ్’ అని పిలువబడే ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది.