శ్రీలంకలో పేలిన మరో బాంబు

-

తాజాగా కొలంబోకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుగోడా అనే ప్రాంతంలో మరో బాంబు పేలింది. అయితే.. బాంబు పేలిన ప్రాంతంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

దశాబ్ద కాలంలో ఇటువంటి దారుణ మారణ కాండ చోటు చేసుకోలేదు. శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లు చాలా దారుణమైనవి. చర్చీల్లో ప్రార్థనలు చేసుకుంటున్నవారిని నిర్దాక్షిణ్యంగా బాంబు పేలుళ్లతో చంపేశారు. స్టార్ హోటళ్లనూ వదల్లేదు. శ్రీలంక బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 350 దాటింది. గాయపడిన వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

అయితే.. తాజాగా కొలంబోకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుగోడా అనే ప్రాంతంలో మరో బాంబు పేలింది. అయితే.. బాంబు పేలిన ప్రాంతంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. పుగోడాలోని మెజిస్ట్రేట్ కోర్టుకు వెనకాల ఈ పేలుడు సంభవించింది. అయితే.. ఇది ఆ ప్రాంతంలో ఎందుకు పేలింది.. ఇంకా బాంబులు ఎక్కడెక్కడ పెట్టారోనని పోలీసులు గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version