హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం.. కారులో నిద్రపోతున్న వ్యక్తి సజీవ దహనం

 

హైదరాబాద్‌ మహా నగరంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే.. స్వప్నలోక్‌ ప్రమాదం జరుగగా.. తాజాగా మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో కారులో నిద్రపోతున్న వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ అబిడ్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది.

బొగ్గుల కుంటలోని కామినేని హాస్పిటల్ పక్కనే కారు గ్యారేజిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేసింది ఫైర్ సిబ్బంది. దాదాపు ఐదు కార్లు ఈ ప్రమాదం లో దగ్ధం అయ్యాయి. అయితే.. కారు లోనే సెక్యూరీటి గార్డ్ సంతోష్ సజీవ దహనం అయ్యాడు. కామినేని హాస్పిటల్ కి అనుకునే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనకు పక్కనే హాస్పిటల్ కి సంబంధించిన పవర్ జనరేటర్స్ కారణమని సమాచారం అందుతోంది.