సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చివరి దశకు చేరుకుంది. సెమీఫైనల్స్ క్రికెట్ పోటీలు శుక్రవారం.. విశాఖపట్నంలోని పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హోరీహోరీగా సాగాయి. రెండో సెమీఫైనల్లో తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్ జట్లు తలపడగా.. తెలుగు వారియర్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. తెలుగు వారియర్స్‌కు అఖిల్ అక్కినేని సారథ్యం వహించారు. కర్ణాటక బుల్డోజర్స్‌కు సుదీప్ కెప్టెన్‌గా వ్యవహరించారు.
రెండో సెమీఫైనల్లో కర్ణాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో పది ఓవరల్లో.. ఆరు వికెట్ల నష్టంతో 99 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తెలుగు వారియర్స్.. అదే ఆరు వికెట్ల నష్టంతో 95 పరుగులే చేసింది. తెలుగు వారియర్స్ బౌలర్ సామ్రాట్ మొదటి ఇన్సింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో కర్ణాటక టీమ్.. 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు కొట్టింది. తెలుగు వారియర్స్ బ్యాటర్లు ధాటిగా బ్యాటింగ్ చేసి 103 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేశారు. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లారు.