నో ఏజ్ లిమిట్: తప్పుడు పోస్టులు పెడితే తాట తీస్తున్నారు!

సోషల్ మీడియా అనేది భారతదేశంలో ఏస్థాయిలో హల్ చల్ చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే! ఈ సోషల్ మీడియాతో ప్రతి ఒక్కరికీ స్పందించే అవకాశం వచ్చింది అనే చెప్పుకోవాలి! కాకపోతే… విలువైన ఈ ఫ్లాట్ ఫాం ని అసత్యప్రచారాలకు వేదికగా వాడుకోవడం అనేది సర్వసాధారణమైపోయిన రోజులివి! అభిప్రాయాలు చెప్పడం వేరు.. అసత్యప్రచారాలు చేయడం వేరు! ఈ రెండింటికీ తేడా తెలియకుండా జనాలను తప్పుడుదోవ పట్టిస్తూ.. ప్రభుత్వాల ప్రతిష్టలను దిగజార్చే వారిపై ఏపీ సీఐడీ చాలా సీరియస్ గా ఉంది! లక్షల్లో ఫైన్ లు సంవత్సరాలపాటు జైలుశిక్షలు అని క్లారిటీ ఇస్తుంది!

అవును… సోషల్ మీడియాలో అసత్యప్రచారాలపై ఏపీ సీఐడీ కొరడా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ విషయంలో అసత్య ప్రచారం చేసిన గుంటూరు వాసి రంగనాయకమ్మపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఇదే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపడుతూ పెట్టిన పోస్టుకు సహకరించిన రఘునాద్ మల్లాడిపై కూడా సీఐడీ దృష్టి సారించింది. ఈ విషయంలో వయసుతో సంబందం లేదని… ఏ వయసువారు తప్పుడు పోస్టులు పెట్టినా తాట తీస్తామని సీఐడీ చెప్పుకొస్తుంది! ఈ క్రమంలో ఇప్పటికైనా ఈ అసత్యప్రచారాలు చేసే జనాలు మారతారో లేదో చూద్దాం!

ఈ క్రమంలో ఈ వ్యవహారాలపై సీఐడీ ఎస్పీ సరిత స్పందించారు! సున్నితమైన అంశంలో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయేలా ప్రచారం చేస్తున్నారని… సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాల విషయంలో హెచ్చరికలు చేస్తున్నా కూడా పోస్టింగులు పెట్టినందువల్లే రంగనాయకమ్మను అరెస్ట్‌ చేశామని క్లారిటీ ఇచ్చారు! ఈ విషయంలో ఏ వయసు వారు తప్పు చేసినా శిక్ష తప్పదు అని… మొదటిసారి తప్పు చేసిన వారికి న్యాయస్థానం 3 ఏళ్ల జైలుశిక్ష , రూ.5 లక్షల జరిమానా విధిస్తుంటుండగా… రెండోసారి తప్పుచేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తుందని ఎస్పీ సరిత హెచ్చరించారు.