విద్యార్థిని స్నానం చేస్తుండగా వీడియో… బ్లాక్ మెయిల్ చేస్తూ…

కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఒంటరిగా యువతి కనబడితే అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. మరోవైపు స్నేహం నటిస్తూనే వంచిస్తున్నారు. బ్లాక్ బెయిల్ చేస్తూ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… దేశంలో ఎక్కడో చోట లైంగిక వేధింపులకు సంబంధించి కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యువతులు, బాలికలు తెలిసిన వారి నుంచే ఎక్కువగా లైంగిక దాడులను ఎదుర్కొంటున్నారు.

minor girl molested by her step brother in jharakhand

తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తిరువూర్ కు చెందిన ఓ విద్యార్థిని బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని స్నానం చేస్తుండగా.. నగ్న వీడియోలు తీసిన కామాంధుడు శ్యామలేని సురేష్ కుమార్… ఆ వీడియోలను అడ్డు పెట్టుకుని బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో బాలిక తల్లి విషయం తెలుసుకుని తిరువూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సురేష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని…కోర్టులో హాజరుపరచగా… జడ్జ్ రిమాండ్ విధించారు.