LIC: వాటే పాలసీ… రూ. 43 పొదుపు చేస్తే 40,000 పొందొచ్చు..!

-

ఈ మధ్య కాలం లో ఎవరికి నచ్చిన స్కీమ్స్ లో వాళ్ళు డబ్బులు పెడుతున్నారు. దీని వలన మంచిగా లాభాలు వస్తున్నాయి. అయితే చాలా మంది ఎల్‌ఐసీ పాలసీలను కూడా తీసుకుంటూ వుంటారు. ఇవి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎల్‌ఐసీ భారతదేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్‌ కంపెనీ. దేశం లోని ప్రతి వర్గాలకి ఇన్సూరెన్స్‌ పాలసీలని ఇస్తుంది.

LIC
LIC

పైగా ఇందులో డబ్బులు పెడితే ఏ రిస్క్ ఉండదు. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా 100 సంవత్సరాల వరకు బీమా రక్షణ పొందుతారు. LIC అందించే వాటిలో జీవన్ ఉమంగ్ పాలసీ కూడా ఒకటి. ఇది ఎండోమెంట్ పాలసీ. మెచ్యూరిటీపై భారీ మొత్తంలో ప్రయోజనాన్ని అందిస్తుంది. ఎవరు ఈ పాలసీ తీసుకోచ్చు అనేది చూస్తే… ఈ పాలసీని 90 రోజుల వయస్సు నుంచి 55 సంవత్సరాల వయస్సు వాళ్ళ వరకు తీసుకోచ్చు.

జీవిత బీమా కవరేజీని కూడా పొందొచ్చు. 100 ఏళ్లలోపు మరణిస్తే ఈ పరిస్థితిలో డిపాజిట్ మొత్తం నామినీకి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ పాలసీ ని 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు. పెట్టుబడిదారుడు కనీసం రూ. 2 లక్షల హామీ మొత్తాన్ని పొందుతాడు.

ఇక ఎంత డబ్బులు పెట్టాలి..?, ఎంత వస్తాయి అనేది చూస్తే… ప్రతిరోజూ రూ.43 పెట్టుబడితో ఈ పాలసీని మొదలు పెడితే ప్రతి నెలా దాదాపు రూ.1302 పెట్టుబడి పెడతారు. ఒక సంవత్సరంలో ఈ ప్రీమియం దాదాపు రూ. 15,298 అవుతుంది. ముప్పై ఏళ్ళకి రూ. 4.58 లక్షలు అవుతుంది. 40 సంవత్సరాల వయస్సులో ఈ పాలసీని కొనుగోలు చేస్తే 70 సంవత్సరాల వరకు ప్రీమియం కట్టాలి. 71 వ సంవత్సరం నుంచి 100 సంవత్సరాల వరకు మీరు ప్రతి సంవత్సరం నెలకు రూ. 3333 అంటే సంవత్సరానికి సుమారు 40 వేల రూపాయలు తీసుకోచ్చు. ఒకవేళ 100 ఏళ్లలోపు మరణిస్తే డబ్బులు నామినీకి వెళతాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news