బ్యాంకు పనులు ఉంటే ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటే మంచిది. ఏమైనా సెలవలు వచ్చాయంటే బ్యాంకు పనులు అవ్వవు. అందుకనే సెలవులను చూసుకుంటే బ్యాంకు పనులు చేసుకోచ్చు. ఏదైనా పని ఉంటే ఇప్పుడే దాని కోసం ప్లాన్ చేయండి. లేకపోతే పనులు ఆగిపోతూ ఉంటాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 2022 సెలవుల జాబితాను విడుదల చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. జాతీయ సెలవులు కాకుండా రాష్ట్రాల ప్రకారం కూడా కొన్ని సెలవులు ఉంటాయి. ఈ మే నెలలో 11 రోజులు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. అయితే మరి ఏయే రోజులు సెలవులు అనేది చూసేద్దాం.
May 1 ఆదివారం అన్ని చోట్ల సెలవు
May 2 సోమవారం Ramjan-Eid (Eid-UI-Fitra) కోచి, తిరువనంతపురం లో సెలవు
May 3 మంగళవారం భగవాన్ శ్రీ పరశురామ్ జయంతి/రంజాన్/ బసవ జయంతి/అక్షయ త్రితీయ కోచి, తిరువనంతపురం తప్ప అన్ని చోట్ల సెలవే.
May 8 ఆదివారం అన్ని చోట్ల సెలవు
May 9 సోమవారం రవీంద్ర నాధ్ ఠాగూర్ జన్మదినం కలకత్తా లో సెలవు
May 14 రెండో శనివారం అన్ని చోట్ల సెలవు
May 15 ఆదివారం అన్ని చోట్ల సెలవు
May 16 సోమవారం బుద్ధ పూర్ణిమ
May 22 ఆదివారం అన్ని చోట్ల సెలవు
May 28 నాలుగో శనివారం అన్ని చోట్ల సెలవు
May 29 ఆదివారం అన్ని చోట్ల సెలవు.