కరీంనగర్ జిల్లాలో దారుణం..ప్రియుడితో భార్య శృంగారం..అది సహించలేక !

కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో దారుణ హత్య చోటు చేసుకుంది. ప్రియుడితో లేచిపోయిన భార్యను భర్త హత్య చేశాడు. ఈ సంఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లకి వెళితే… బెజ్జంకి మండలం విరాపూర్ కు చెందిన యళ్ల ఎల్లారెడ్డి కి 20 సంవత్సరాల క్రితం స్వప్న అనే మహిళతో వివాహం అయింది.

5 ఏళ్ల క్రితం అక్రమ సంబంధం పెట్టుకుని… రమేష్ ఆనే వ్యక్తితో లేచిపోయింది స్వప్న. ఆ తర్వాత అదే గ్రామంలో.. రమేష్‌ తో జీవిస్తోంది. ఇక నిన్న గ్రామంలో స్వప్న ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం జీర్ణించుకోలేని ఎల్లారెడ్డి.. బతుకమ్మ పండగ సందర్భంగా బయటకు వచ్చిన స్వప్న పై రాడ్ తో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన స్వప్న మృతి చెందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.