స్నానం చేస్తుండగా వీడియో తీసి.. చెల్లెలిపై సోదరుల అత్యాచారం

బిహార్‌ పశ్చిమ చంపారన్‌లో దారుణం జరిగింది. చెల్లెలు స్నానం చేస్తుండగా వీడియో తీశారు ఇద్దరు సోదరులు. అనంతరం ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వైరల్ చేస్తామని బెదిరించి.. మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన శిఖర్పుర్​​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని దియులియా గ్రామంలో జరిగింది.

బాధితురాలి కుటుంబ సభ్యులు మొహర్రం ఊరేగింపునకు వెళ్లారు. బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో నిందితులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులు మహ్మద్‌ ఫైజ్, మహ్మద్ రాజన్ గోడ ఎక్కి బాలిక ఇంట్లోకి ప్రవేశించారు. బాలిక స్నానం చేస్తుండగా వీడియో తీశారు. ఫేస్​బుక్​లో వీడియోను అప్​లోడ్ చేస్తామని బెదిరించి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ప్రధాన నిందితుడు. కొన్ని రోజుల తర్వాత నిందితుడి సోదరుడు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పరారీలో ఉన్న రెండో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.