తెలంగాణలో బీజేపీ…రోజురోజుకూ బలపడుతుంది…ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు…రెండేళ్ల నుంచి ఓ రేంజ్ లో బీజేపీ బలపడుతూ వస్తుంది…ఒక సీటు దగ్గర నుంచి…నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతుంది. అధికార టీఆర్ఎస్ వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ బలహీనత బీజేపీకి కలిసొస్తుంది…అలాగే బీజేపీ నేతల దూకుడు అతి పెద్ద ప్లస్. ఇక కేంద్రం పెద్దల సపోర్ట్…బీజేపీకి అదనపు బలం.
అయితే అంతా బాగానే ఉంది..కానీ బీజేపీకి ఇంకా క్షేత్ర స్థాయిలో బలం మాత్రం లేదని చెప్పొచ్చు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు గాని…వారిని ఇంకా తమ వైపు తిప్పుకునే బలమైన నేతలు బీజేపీలో కనబడటం లేదు. ఇంకా చెప్పాలంటే క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఉన్న బలమైన నాయకత్వం బీజేపీకి లేదు. ఏదో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే బలమైన నాయకత్వం ఉంది…ఇటీవల వచ్చిన మస్తాన్ సర్వేలో…బీజేపీకి 29 స్థానాల్లోనే బలమైన నాయకత్వం ఉందని తేలింది.
అంటే బీజేపీ ఇంకా ఎన్ని స్థానాల్లో బలపడాలో చెప్పాల్సిన పని లేదు. అయితే క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పుడు ఓ కొత్త నేత…తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న తరుణ్ ఛుగ్ కు కేవలం రాజకీయ వ్యవహారాల పర్యవేక్షణకు పరిమితం చేసి…రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సునీల్ బన్సాల్ ని సంస్థాగత అంశాలను పర్యవేక్షించడానికి పెట్టారు. ఇక అమిత్ షా రైట్ హ్యాండ్ గా ఉన్న సునీల్ రాకతో తెలంగాణలో బీజేపీ ఇంకా సంస్థాగతంగా బలపడే అవకాశాలు మెరుగు అయ్యాయి.
ఉత్తర్ ప్రదేశ్‌లో 2017లో బీజేపీ విజయం సాధించడంలో సునీల్ బన్సాల్ కీలక పాత్ర పోషించారు. అలాగే 2022లో యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడానికి పనిచేశారు. ఈయన పని అంతా..బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు అభ్యర్థుల ఎంపిక చేయడమే. వీటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టి సునీల్ పనిచేస్తారు. మరి తెలంగాణలో కూడా కమలం పార్టీని అధికారంలోకి తీసుకొస్తారేమో చూడాలి.