బతికే ఉన్నాడు: కమెడియ‌న్ వేణు మాద‌వ్‌ను చంపొద్దు..

-

అంద‌రినీ న‌వ్వించే కమెడియన్ వేణు మాదవ్  అందరికీ దూర‌మైన‌ట్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కానీ ఆయ‌న య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స‌పొందుతున్నారు. కిడ్నీ స‌మ‌స్య‌తో ఆయ‌న ఇటీవ‌లె ఆస్ప‌త్రిలో చేరారు. డాక్ట‌ర్లు వెంటిలేష‌న్ మీద ఉంచి ప్ర‌త్యేక చికిత్స అందిస్తున్నారు. హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత యశోద ఆస్పత్రికి వెళ్లి వేణుమాధవ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులు, డాక్టర్లతో మాట్లాడారు.
వేణుమాధవ్ ఆరోగ్యంపై గతంలో  కూడా చాలా రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన చ‌నిపోయిన‌ట్టు  సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కానీ విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఆయ‌న బ‌తికే ఉన్నారు. తీవ్ర అస్వ‌స్థ‌తో ఉన్న ఆయ‌న‌కు వెంటిలేష‌న్ మీద వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విష‌యంపై డాక్ట‌ర్ల నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న‌లు రాక‌పోయిన‌ప్ప‌టికీ తెలిసిన స‌మాచారం ప్ర‌కారం ఆయ‌నకు చికిత్స అందుతున్న‌ది.

కొంద‌రు మాత్రం సోష‌ల్ మీడియా వేదిక‌క‌గా ఆయ‌న చ‌నిపోయిన‌ట్టు ప్ర‌చారం చేస్తున్నారు. గ‌తంలో కూడా వేణు మాధ‌వ్ మృతి చెందిన‌ట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వ‌చ్చింది. దీంతో ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చి తీవ్ర ఆవేద‌న చెందిన విష‌యం తెలిసింద‌. సో. ఇప్పుడు ఆయ‌న బ‌తికే ఉన్నాడు కాబ‌ట్టి ఎవ‌రూ త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌కుండా బ‌తికాల‌ని కోరుకుందాం.. కాగా ఆయ‌న చాలా సామాన్య స్థాయి నుంచి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కి వ‌చ్చి క‌మెడియ‌న్‌గా పేరు పొందారు. ఆయన మొదటి సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సాంప్రదాయం అనే సినిమా. తొలిప్రేమ సినిమాలో అమ్మాయిలపైన చాటభారతమంత డైలాగును ఆయన్ను ప్రేక్షకులకు చేరువ చేసింది. దిల్ సినిమాతో మంచి పేరు వచ్చింది. లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నాడు.

సాధార‌ణ స్థాయి నుంచి తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌దైన గుర్తింపు పొందారు వేణు మాద‌వ్‌. ఇలా 1996లో ‘సాంప్రదాయం’ సినిమా ద్వారా నటుడిగా పరిచయమ్యారు. ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’, ‘సుస్వాగతం’, ‘తమ్ముడు’ సినిమాలతో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దశాబ్దన్నర కాలంపాటు హాస్యనటుడిగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ‘హంగామా’ సినిమా ద్వారా ఆయన హీరోగా కూడా మారారు. సామాన్య‌మైన స్థాయి నుంచి వచ్చి ఆయన ప‌రిశ్ర‌మ‌లో అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news