అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. హోంగార్డుకు 30ఏళ్ళ జైలు..

-

మహిళల భద్రత విషయంలో ఎన్నో చట్టాలున్నాయి. అత్యాచారలకు పాల్పడే నేరస్తులకు నిర్భయ మొదలుకుని దిశ వరకు చాలా చట్టాలు వచ్చాయి. అయినా కానీ మహిళలపై ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో కోర్టులు ఎంత పెద్ద శిక్షలు విధిస్తున్నా ఈ ఘోరాలు తగ్గట్లేదు. తాజాగా అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో హోంగార్డుకు 30ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ లోని తుకారం గేట్ లో నివసించే హోంగార్డు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయమై ఈ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన పోలీసులు హోంగార్డును అరెస్టు చేసారు. దాదాపు 6నెలల విచారణ తర్వాత హోంగార్డుకు శిక్ష పడింది. 30ఏళ్ళ జైలు శిక్షతో పాటు బాధితురాలి కుటుంబానికి 40వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించింది. హోంగార్డు మల్లికార్జున్, తుకారాం గేట్ లో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Read more RELATED
Recommended to you

Latest news