బోనాల పండుగకు భార్య రాలేదని భర్త సూసైడ్.. వీడియో కాల్ చేసి మరీ !

-

బోనాల పండుగకు భార్య రాలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… తుక్కుగూడ లో ఉండే సాయి కార్తీక్ గౌడ్, భార్యతో కలిసి ఈనెల 12వ తేదీన ఆమె బంధువుల ఇంట్లో పెళ్లికి.. కందుకూరు మండలం బేగంపేట వెళ్లాడు. పుట్టింటి వాళ్లు కావడంతో భారీ అక్కడే ఉండిపోగా భర్త శనివారం ఇంటికి వచ్చాడు.

ఆదివారం మీర్పేట్ లో జరిగే బోనాల పండుగకు తన పిన్ని ఇంటికి వెళదామని భార్యకు పదేపదే ఫోన్ చేశాడు భర్త కార్తీక్ గౌడ్. ఆమె ఈ విషయాన్ని తేలికగా తీసుకుంది. దీంతో మనస్థాపం చెందిన సాయి కార్తీక్ గౌడ్… రవళికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.

 

మీ బంధు మిత్రులందరికీ వెళ్తావు.. కానీ మా వాళ్ల వద్దకు నువ్వెందుకు రావంటు ఆగ్రహం వ్యక్తం చేసిన కార్తీక్ గౌడ్… ఆ తరువాత దూలానికి తాడు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news