ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉండాలో తెలుసా..?

-

మన ఇంటిని డెకరేషన్ చేసుకోవడానికి రకరకాల వస్తువులు కొంటుంటాం. ముఖ్యంగా ఇంటికి ఎలాంటి దిష్టి తగలకుండా.. ఇంట్లో అంతా పాజిటివ్ వైబ్స్ రావడానికి.. ఇలా ఇంటికి మంచి జరగాలని కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తాం. వాటిని వాస్తు ప్రకారమే పెట్టాలని చూస్తుంటాం. అలా ఇంట్లో శాంతి కోసం కొనుగోలు చేసే వాటిలో ఒకటి అక్వేరియం. ఇంట్లో అక్వేరియం ఉంటే మంచిదని కొందరి వాదన.. మంచిది కాదని మరికొందరి భావన. అయితే చేపలు విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన మత్స్యావతారం కాబట్టి ఇంట్లో అక్వేరియం ఉంటే మంచిదనేది మరికొందరి వాదన.

 

ఇంట్లో అక్వేరియం ఉండటం వల్ల అవి ఆ ప్రాంతంలోని నెగెటివ్ తరంగాలను లాగేసుకుని పాజిటివ్ వైబ్స్‌ని క్రియేటే చేస్తాయని శాస్త్రజ్ఞానం చెబుతోంది. ఆర్థిక ఇబ్బందులు, సంతానలేమి సమస్యలకు అక్వేరియం చెక్ పెడుతోందని వాస్తు పండితులు అంటున్నారు. మరి అలాంటి అక్వేరియాన్ని ఇంట్లో ఏ  వైపున ఉంచాలి.. ఎన్ని చేపలు ఉంచాలి.. ఎలాంటి రకాల చేపలు ఉంచాలో చూద్దామా..?

ఎన్ని చేపలు ఉండాలి..   అక్వేరియంలో 9 చేపలు  ఉండేలా చూసుకుంటే మంచిది. వాటిలో 8 డ్రాగన్ చేపలు కాని, 8 గోల్డ్ ఫిష్‌లు కాని ఉండాలి. మిగిలిన ఒకటి కచ్చితంగా నల్లచేప ఉండాలి . డ్రాగన్ చేపలు, గోల్డ్ ఫిష్‌లు ఇంటి నుంచి దూరమైన అదృష్టాన్ని తిరిగి తీసుకొస్తాయి. నల్ల చేప… ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తరిమికొడుతుంది. అక్వేరియంలోని ఓ చేప చనిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు..మరో చేపను తీసుకొచ్చి వేయండి. చనిపోయిన చేపని ఇంటి బయట మట్టిలో పాతేయండి, అలాంటి చేపనే తిరిగి అక్వేరియంలో చేర్చండి. ఎప్పటికప్పుడు లెక్క తొమ్మిదికి తగ్గకుండా చూసుకుంటే ఇంట్లో అంతా శుభమే.

అక్వేరియం ఏ ప్రదేశంలో ఉంచాలి..    అక్వేరియం పెడితే మంచిది..అందుకే పెట్టాం అంటే సరిపోదు. ఏ దిశగా ఉంచాలన్నది కూడా చూసుకోవాలి. వాస్తుకు తగ్గట్టుగా సరైన ప్రదేశంలో ఉంచాలి. సొంతిల్లు కదా అని అక్వేరియం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మీ ఇల్లు గుల్లైపోతుంది. అక్వేరియం ఉంచాల్సిన సరైన ప్రదేశం డ్రాయింగ్ రూమ్…అక్కడ కూడా వాస్తు ప్రకారం తూర్పు దిశగా కాని, ఉత్తర దిశగా కాని ఉండాలి. రాత్రిళ్లు అందంగా కనిపిస్తుంది కదా అని బెడ్ రూమ్ లో ఉంచితే దంపతుల మధ్య , కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. వంటింట్లో ఉంచితే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. అక్వేరియం ఎదురుగా దుష్ట జంతువుల బొమ్మలు అస్సలు ఉంచొద్దు. డ్రాగన్, పులి, అనకొండ, సింహం వగైరా వగైరా బొమ్మలు. సమయానికి తగ్గట్టుగా అక్వేరియంలోని పాత నీరును తీసేసి కొత్త నీరును నింపుతుండాలి. ఇంట్లో కానీ, కార్యాలయంలో కానీ సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు ఆ ప్రదేశాల్లో వాస్తు నిబంధనల ప్రకారం అక్వేరియం ఉంచండి.

అయితే.. ఇంట్లో మొదటిసారిగా అక్వేరియం తీసుకొచ్చినప్పుడు అందులోని చేపలు అన్నీ చనిపోతాయి. ఎందుకంటే ఇంట్లో నెగెటివ్ వైబ్స్ అన్నీ చేపలు లాగేసుకుంటాయి కాబట్టి మృత్యువాత పడతాయని వాస్తు పండితులు చెబుతుంటారు. అది అపశకునంగా భావించకుండా మళ్లీ కొత్త చేపలు తీసుకొచ్చి అక్వేరియంలో వేస్తే ఆ తర్వాత అంతా శుభమే కలుగుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news