తుపాకీ చూపించి మహిళపై అత్యాచారం..ఫోర్న్ వీడియోలు చూపించి మరీ !

-

కాలకృత్యాలకు వెళ్లిన మహిళకు గన్‌ చూపించి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ సంఘటన రాజస్థాన్‌ లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని భరత్పూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ బుధవారం కాలకృత్యాల కోసం బయటికి వెళ్ళింది. ఎప్పటినుంచో ఆమె పై కన్నేసిన ఉస్మాన్ అనే వ్యక్తి… ఆ మహిళను వెంబడించాడు.

సమీప అటవీ ప్రాంతం నుంచి తిరిగి వస్తున్న క్రమంలో మహిళలు అడ్డగించాడు. తన కోరిక తీర్చాలని వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తుపాకీ చూపించి బెదిరించాడు. ఆమెను తీవ్రంగా కొట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఉస్మాన్.

చివరికి నిస్సహాయ స్థితిలో తనను కాపాడాలని ఆమె కేకలు వేసింది. బాధితురాలి అరుపులు విన్న కొందరు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆమెను ఉస్మాన్ కొడుతూ కనిపించాడు. దీంతో స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత మహిళలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news