వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని వైద్యులు తేల్చారు. చంపేసే ముందు కనీసం నలుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని తమ నివేదికలో పేర్కొన్నారు. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టారని, ఆపై కిరోసిన్ పోసి నిప్పంటించారని వెల్లడించారు. ఈ ఘటనలో ప్రియాంక మృతదేహం 70 శాతానికి పైగా కాలిపోయిందని, నిర్దారించారు.
కాగా, ఈ దారుణానికి ఆ ప్రాంతంలో లారీలను ఆపుకుని ఉన్న డ్రైవర్లే కారణమని పోలీసులు ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అనంతపురం జిల్లాకు చెందిన ఓ లారీ డ్రైవర్, క్లీనర్ లను విచారిస్తున్నప్పటికీ, నిందితులు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.