రూ.500 కోసం భార్య భర్తల మధ్య గొడవ.. భార్యను భయపెడదాం అనుకోని ఉరేసుకోబోయాడు.. కానీ..

-

ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. జోక్‌ చేద్దాం అనుకుని చేసేవే మన కొంపముంచుతాయి.. సాధారణంగా కోపం వచ్చినప్పుడు, భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు బెదిరించడం సహజం.. చంపుతా, చచ్చిపోతా అంటూ ఒకరినొకరు అనుకుంటారు. సరిగ్గా ఇలానే జరిగింది.. అసలు వీళ్ల మధ్య జరిగిన గొడవ నిజానికి అంత పెద్దది కాదు.. కానీ పెద్ద నష్టమే మిగిల్చింది. భార్యను భయపెట్టడానికి ఉరివేసుకున్నట్లు నాటకం ఆడదాం అనుకున్నాడు.. కానీ ప్లాన్‌ ఫ్లాప్‌ అయింది. ముంబయిలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబయి మహా నగరంలోని విరార్ వెస్ట్‌ వీర్ సావర్కర్ మార్గ్‌లో శర్మ అనే వ్యక్తి తన భార్య చాందినీదేవితో కలిసి నివాసముండేవాడు. శర్మ ఓ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో పనిచేస్తాడు. షాపింగ్ కోసం చాందినీ భర్తను రూ.2000 అడిగింది. అంత డబ్బు అవసరం లేదని.. రూ.1500 తీసుకుని మిగతా రూ.500 తిరిగివ్వాలని చెప్పాడు. సరేనన్న చాందినీ భర్తకు తిరిగి డబ్బులు ఇవ్వలేదు. అంతే భర్తకు కోపం వచ్చింది. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ చిలికి చిలికి గాలివానైంది. రూ.500 ఇవ్వాల్సిందేనని శర్మ పట్టుబట్టాడు.

భార్యను బెదిరించేందుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంటున్నట్లు భయపెట్టాలని భావించాడు. తన బెడ్‌ రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడు. గదిలోని ఫ్యాన్‌కు క్లాత్ కట్టాడు. ఇదంతా భార్య గమనిస్తూనే ఉంది. భర్త కూడా ఆమెను భయపెట్టాలనే అనుకున్నాడు. కానీ ప్రమాదవశాత్తు అతను వేసుకుని ఉరి మెడకు బిగుసుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన చాందినీ.. గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కలా ఉన్నవారికి సమాచారం అందించింది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న శర్మను కిందికి దించారు. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై చాందినీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మొత్తానికి అలా నిండు ప్రాణాన్ని కోల్పాయాడు.. చాలామంది చిన్న చిన్న విషయాలకే సీరయస్‌ అయిపోతుంటారు.. అవసరంలేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడుచేసుకుంటారు. జీవితం చాలా చిన్నది.. మరీ అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ప్రాణం పోయే క్షణం మన చేతుల్లో లేదు..శర్మ అనుకున్నాడా..చనిపోతా అని..కానీ ప్లాన్‌ ఫ్లాప్‌ అయి పోయాడు.. కాబట్టి..వీలైనంత వరకూ లైఫ్‌ను ఎంజాయ్‌ చేయడానికి ప్రయత్నించండి..!పనికిరాని వాటిని పట్టించుకుంటూ పోతే..ఆఖరికి మనల్ని ఎవరూ పట్టించుకోరు..!!

Read more RELATED
Recommended to you

Latest news