సిద్ధిపేట్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి లో అగ్ని ప్ర‌మాదం

సిద్ధిపేట్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రం లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి లో బుధ వారం అర్థ రాత్రి అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి లో ని ఐసోలేష‌న్ వార్డు లో అర్థ రాత్రి ఒక్క సారి గా మంట‌లు వ్యాప్తి చేందాయి. దీంతో ఐసోలేష‌న్ వార్డు లో ఉన్న ఫ‌ర్నిచ‌ర్, వైద్య ప‌రిక‌రాలు ద‌గ్ధం అయ్యాయి. కాగ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది అలార్ట్ కావ‌డం తో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు.

మంట‌లు వ‌చ్చిన వెంట‌నే ఐసోలేష‌న్ లో ఉన్న పేషంట్స్ ను ఆస్ప‌త్రి సిబ్బంది బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు. దీంతో పోలీసుల‌కు, ఫైర్ సిబ్బంది స‌మాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది ఘ‌ట‌న స్థలా నికి వ‌చ్చి మంట‌ల‌ను ఆర్పి వేశారు. అయితే ఆస్ప‌త్రి లో ని ఐసోలేష‌న్ విభాగం లో షాట్ స‌ర్క్యూట్ అవ‌డం తోనే ఈ అగ్ని ప్ర‌మాదం జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు అంచ‌న వేస్తున్నారు. కాగ ఈ అగ్ని ప్ర‌మాదం లో ఎలాంటి ప్రాణ న‌ష్టం కానీ ఎవరి గాయాలు కానీ కాలేదు. కానీ ఆస్తి న‌ష్టం భారీగా అయిన‌ట్టు తెలుస్తుంది.