హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో గల హౌజింగ్ బోర్డు కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో కేపీహెచ్‌బీలో ఉన్న శివ పార్వతి అనే థీయేటర్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థాలనికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కానీ అప్పటికే శివ పార్వతి థీయేటర్ లోని సామాగ్రీ అంతా దగ్ధం అయింది. కాగ ఈ అగ్ని ప్రమాదం ఆది వారం అర్థరాత్రి సమయంలో చోటు చేసుకుంది.
స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్ల ను ఉపయోగించి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. కాగ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తుంది. కానీ ఆస్తి నష్టం భారీ గానే జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందో, దానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.