బండి సంజయ్ జాగరణ దీక్ష.. పెద్ద డ్రామా దీక్ష అని మంత్రి గంగుల కౌంటర్ ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోందని.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే కోవిడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాడని నిప్పులు చెరిగారు. ఇవాళ్టి కరీంనగర్ లో కేసులు పెరిగితే బండి సంజయ్ బాధ్యత వహించాలని.. బండి సంజయ్ దీక్ష చేయలసింది మోడీ ఇంటి ముందు కోటి ఉద్యోగాలపై దీక్ష చేయాలని చురకలు అంటించారు.
జాగరణ దీక్షకు ఒక్క పర్మిషన్ అయినా ఉన్నదా? ప్రజల్లో సానుభూతి కోసమే జాగరణ దీక్ష చేసాడని నిప్పులు చెరిగారు. బండి సంజయ్ కు జీవో నెంబర్ 317 పై ఏమి అవగాహన ఉందని… జీవో విషయంలో ప్రభుత్వానికి ఏమన్నా లేక రాసాడా అని నిలదీశారు. ఉపాధ్యాయ సంఘాలతోనే మంతనాలు జరిపారని… కరీంనగర్ ఎంపీ కోవిడ్ ఉల్లంఘన కు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సంజయ్ చుట్టూ వందల మంది మాస్కులు లేకుండా ఎందుకు పాల్గొన్నారని… జాగరణ దీక్షను అడ్డుకున్న పోలీసులకు అభినందనలు అని తెలిపారు. మాకు రాజకీయం ముఖ్యం కాదు కరీంనగర్ జిల్లా ప్రజల ఆరోగ్యాలే ముఖ్యమన్నారు.