సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆందోల్ మండలం కన్సాన్పల్లి శివారులో ఆర్టీసీ బస్సు కారు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పొగ మంచు వల్ల రోడ్డు సరిగ్గా కనిపించకపోవడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శీతాకాలం ప్రారంభమైన దృష్ట్యా ప్రజలు తెల్లవారుజామున ప్రయాణాలు వీలైనంత వరకు తగ్గించుకోవాలని సూచించారు.