కాసేపటి క్రితమే మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండలాల్లో 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 వరకు లైనులో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఈ తరుణంలో ఫేక్ న్యూస్ బాగా వైరల్ అవుతున్నాయి.
టీఆర్‌ఎస్ నేతలు బీజేపీలోకి వెళుతున్నారని ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్…కూడా బీజేపీలోకి వెళుతున్నారని జోరుగా ప్రచారం చేశారు. అయితే.. దీనిపై స్వయంగా కర్నె ప్రభాకర్..ఓ వీడియో ద్వారా స్పందించారు. మునుగోడులో ఓటమి భయంతో బీజేపీ ఫేక్ న్యూస్ ప్రచారాలకు తెగబడ్డది.. బీజేపీ అసత్యప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారే అంటూ టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.. ఓ వీడియో రిలీజ్ చేశారు.
మునుగోడులో ఓటమి భయంతో బీజేపీ ఫేక్ న్యూస్ ప్రచారాలకు తెగబడ్డది.. బీజేపీ అసత్యప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారే : టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.@karne_prabhakar pic.twitter.com/eShYcvlVd8
— TRS Party (@trspartyonline) November 3, 2022