కరీంనగర్ జిల్లాలో మిర్యాలగూడ తరహా పరువు హత్య..

-

ఇంకా జనాలు మారట్లేదు. డబ్బు, బంధాల కంటే పరువు, కులానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. టెక్నాలజీ మారినా.. మనుషులు మారలేదు. వాళ్ల ఆలోచనా శక్తి కూడా ఇంకా అక్కడే ఎక్కడో ఉండి పోయింది. వాళ్లను అక్కడి నుంచి ఈ జనరేషన్ లోకి తీసుకురావడం కష్టమే. దానికి ఫలితమే ఈ పరువు హత్యలు. దేశ వ్యాప్తంగా తరుచుగా ఎన్నో పరువు హత్యలను చూస్తూనే ఉన్నాం.

తెలంగాణలోనూ పరువు హత్యలు జరుగుతున్నాయి. ఇదివరకు కూడా ఎన్నో జరిగాయి. కానీ.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మాత్రం మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య. దాని తర్వాత కూడా హైదరాబాద్ లోనూ ఒకటి రెండు సంఘటనలు జరిగినప్పటికీ అవి కేవలం మర్డర్ అటెంప్ట్స్. కానీ.. ఇప్పుడు మరో పరువు హత్య కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.

జిల్లాలోని తాడికల్ కు చెందిన గడ్డి కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే.. అతడిది అనుమానాస్పద మృతి కాదు.. చంపేశారని కుమార్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాడికల్ శివారు ప్రాంతమైన వంకాయగూడెంలోని ఓ పత్తి చేనులో కుమార్ మృతదేహం లభ్యమైంది. కుమార్ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులే కుమార్ ను హత్య చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆందోళన నిర్వహించారు. పోలీసులను కూడా అడ్డుకున్నారు. రహదారిపై మృతదేహంతో భైటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news