గూగుల్ లోకి వెళ్లి ఒక సారి రిచెస్ట్ విలేజ్ ఇన్ చైనా అని సెర్చ్ చేయండి. మీకు హువాక్సీ విలేజ్ అనే పేరు వస్తుంది. అవును.. ఆ ఊరు చైనాలోనే అత్యంత ధనవంతమైన ఊరు. ప్రపంచంలోని రిచెస్ట్ విలేజెస్ లో ఆరోది. ఆ ఊళ్లో ఉన్న ప్రతి ఒక్కరు కోటీశ్వరులే. అక్కడ ట్రాన్స్ పోర్ట్ కోసం వాళ్లు వాడే వాహనం ఏంటో తెలుసా? హెలికాప్టర్.. అవును.. ట్యాక్సీలు, బస్సులు, కార్లు కాదు.. ఆ దశను వాళ్లు ఎప్పుడో దాటేశారు. అంతా హెలికాప్టర్ లోనే. అయ్య బాబోయ్.. వాళ్లు అంత రిచా అని నోరెళ్ల బెట్టకండి. వాళ్లు ఎలా, ఎందుకు, ఎప్పుడు రిచ్ అయ్యారో చదివి తెలుసుకోండి.
1961 లో ఈ రిచెస్ట్ విలేజ్ రూపుదిద్దుకున్నది. ఈ ఊళ్లో ఓ కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ మామూలుది కాదు.. చాలా పెద్ద కంపెనీ. ఆ కంపెనీ కోసం గ్రామస్థులంతా తమ భూమిని ఇచ్చేశారు. దీంతో ఆ కంపెనీలో షేర్ హోల్డర్స్ అయ్యారు. అలా ఆ కంపెనీలో భాగస్వామ్యం అయ్యారు. కంపెనీకి వచ్చే లాభాల్లో ఐదు శాతం గ్రామస్తులకే చెందుతుంది. ఆ ఊర్లోని ప్రతి కుటుంబానికి అక్కడి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఉండటానికి ఇల్లు, ఇతర వసతులు అన్నీ. ఎందుకంటే.. వాళ్లు ఆ ఊరు కంపెనీలో షేర్ హోల్డర్స్ కదా. ఇక.. ఆ ఊర్లో పేద్ద భవనం ఒకటి ఉంటుంది. 72 అంతస్థుల భవనం అది. అది చైనాలోని అతి పెద్ద భవనాల్లో 15వది. ఆ గ్రామంలో ఉండే అది పెద్ద పార్క్. ఇలా.. ఆ ఊళ్లో అన్నీ స్పెషలే. అన్నీ రికార్డే. ఆ ఊళ్లో అన్నీ ఫ్రీనే. విద్య, వైద్యం అన్నీ ఉచితం. ఎవ్వరూ ఒక్క రూపాయి తీసుకోరు. కాకపోతే.. హువాక్సీ ప్రజలకే ఆ సదుపాయాలన్నీ. వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లు మాత్రం డబ్బులు కట్టే చదువుకోవాలి. డబ్బులు కట్టే వైద్యం చేయించుకోవాలి.
మనకులా ఆ ఊళ్లో వారానికి ఒకరోజు సెలవు ఉండదు. ప్రతి రోజు వాళ్లు పని చేస్తారు. అక్కడ డ్రగ్స్ తీసుకోవడం, గ్యాంబ్లింగ్ ఆడటం, పబ్ అండ్ రెస్టారెంట్లు, క్లబ్స్ గట్రా ఏమీ ఉండవు. కష్టపడి పని చేయడమే వాళ్లకు తెలుసు. డబ్బులను అనవసరమైన వాటికి ఖర్చుపెట్టకపోవడం కూడా ఆ గ్రామస్తులను కోటీశ్వరులను చేసింది.