జగన్‌పై దాడి కేసు.. నోరు విప్పిన శ్రీనివాసరావు.. జగనే నన్ను కాపాడారు..!

-

నేను కావాలని వైఎస్ జగన్ మీద దాడి చేయలేదు. వైఎస్ జగన్‌కు నేను వీరాభిమానిని. నేను ఆయనపై దాడి ఎందుకు చేస్తా. వైఎస్ జగన్ ఎయిరపోర్టుకు వచ్చారని తెలుసుకొని.. ఆయనకు కాఫీ ఇద్దామని ఆయన్ను చూడటం కోసం వెళ్లా.

వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు ఇవాళ బెయిల్‌పై విడుదలయ్యాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదల అయిన అనంతరం శ్రీనివాసరావు నోరు విప్పాడు. అసలు ఆరోజు అక్కడ ఏం జరిగిందో పోలీసులకు, మీడియాకు వెల్లడించాడు.

jagan attacker srinivasarao released from jail

ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది. నేను కావాలని వైఎస్ జగన్ మీద దాడి చేయలేదు. వైఎస్ జగన్‌కు నేను వీరాభిమానిని. నేను ఆయనపై దాడి ఎందుకు చేస్తా. వైఎస్ జగన్ ఎయిరపోర్టుకు వచ్చారని తెలుసుకొని.. ఆయనకు కాఫీ ఇద్దామని ఆయన్ను చూడటం కోసం వెళ్లా. అలాగే నా దగ్గర ఉన్న ప్ర‌జా సమస్యలకు సంబంధించిన పేపర్‌ను జగన్‌కు ఇద్దామనుకున్నా. అదే సమయంలో నాదగ్గర ఉన్న కత్తి ఒకటి ఆయనకు గుచ్చుకుంది. నేను చెఫ్‌ని. నాదగ్గర పళ్లు కోసే కత్తులు ఉంటాయి. జగన్‌కు ప్రమాదవశాత్తు గుచ్చుకున్న కత్తి కూడా అదే. జగన్‌కు కత్తి గుచ్చుకోగానే.. అక్కడున్న వాళ్లంతా నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తే వద్దని వారించి నన్ను ఆపింది జగనే. ఆయనే నన్ను కాపాడారు.. అంటూ శ్రీనివాసరావు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news