ఆర్కే రోజాకు హోం మినిస్ట్రీ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూట్‌లోనే జగన్ కూడా?

-

తన తండ్రి ఆశయాల కోసమే రాజకీయాల్లోకి వచ్చిన జగన్.. 2004 సీన్‌ను మళ్లీ రిపీట్ చేశారు. తన తండ్రి కూడా పాదయాత్రతోనే అధికారంలోకి వచ్చారు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఏపీలో రెండు సార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. 2004లో అధికారంలో ఉన్న టీడీపీని ఓడించి మరీ.. తన పాదయాత్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తర్వాత 2009లోనూ అదే ఫామ్‌ను కొనసాగించి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తన కేబినేట్‌లో మహిళలకు ప్రాధాన్యం కల్పించారు రాజశేఖర్‌రెడ్డి.

చేవెళ్ల ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి తన కేబినేట్‌లో మంత్రి పదవిని ఇచ్చి మహిళా సాధికారితకు తోడ్పాటు అందించారు. 2004లో మైన్స్ మినిస్ట్రీ ఇవ్వగా.. 2009లో సబితకు హోంమినిస్ట్రీ ఇచ్చారు.

ఇప్పుడు జగన్ కూడా అదే పంథాను కొనసాగించనున్నారా? తన తండ్రి.. మహిళా సభ్యురాలికి హోం మినిస్ట్రీని ఇచ్చినట్టే.. జగన్ కూడా వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు హోం మినిస్ట్రీ ఇవ్వనున్నారట. ఈనెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఆయనతో పాటు 9 మందికి కేబినేట్‌లో స్థానం కల్పించనున్నారట. వాళ్లలో ఆర్కే రోజాకు హోం మినిస్ట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. తన తండ్రి ఆశయాల కోసమే రాజకీయాల్లోకి వచ్చిన జగన్.. 2004 సీన్‌ను మళ్లీ రిపీట్ చేశారు. తన తండ్రి కూడా పాదయాత్రతోనే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు జగన్ కూడా పాదయాత్రతోనే అధికారంలోకి వచ్చారు. సో.. తన తండ్రి బాటలోనే నడిచి.. తండ్రి పాలనను మరోసారి ఏపీ ప్రజలకు చూపించాలని జగన్ భావిస్తున్నారని.. ఈనేపథ్యంలో రోజాకు హోం మినిస్ట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news