ఈ మధ్య కాలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పని భారం పెరుగుతుంది. దీంతో చాలా మంది పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలోని బయ్యారం మండలంలో గల నారాయణపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈసం వెంకటేష్ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసింది. ఈ నెల 4 వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఈసం వెంకటేష్ ఆదివారం రోజు చికిత్స పోందుతూ మృతి చెందాడు.
కాగ పంచాయతీ కార్యదర్శి ఈసం వెంకటేష్ ఆత్మహత్యాయత్నం చేసే ముందు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. పంచాయతీ కార్యదర్శిలది ఉద్యోగమా..? లేకా బానిస బతుకా..? అని లేఖ లో జిల్లా కలెక్టర్ ను ఈసం వెంకటేష్ అడిగారు. పంచాయతీలో నిధులు లేక అప్పులు చేయాల్సి వస్తుందని లేఖ లో తెలిపాడు. పని ఒత్తిడికి తోడు స్థానిక ప్రజా ప్రతినిధుల వేధింపులు కూడా ఉన్నాయని లేఖ లో రాశారు.
అయితే ఈసం వెంకటేష్ మృతి చెందడంతో పంచాయతీ కార్యదర్శుల సమస్యలు మరో సారి తెర పైకి వచ్చాయి. నిధులు లేకున్నా.. అప్పులు చూసి మరి పనులు చేస్తున్నామని పలువరు కార్యదర్శులు చెబుతున్నారు. పనులు జరగకుంటే పై అధికారుల నుంచి ఒత్తడి, స్థానికి ప్రజా ప్రతినిధుల నుంచి వేధింపులు వస్తున్నాయని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.