ఏపీలో దారుణం: అయిదేళ్ళ పాపపై రేప్… బ్లీడింగ్ అవుతుంటే…!

అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని కొన్ని ఘటనలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఒక ఘటన గోదావరి జిల్లాలో ఆందోళన కలిగించింది. కాకినాడ గోలీలపేటలో దారుణం చోటు చేసుకుంది. అయిదేళ్ల బాలికపై ఆగంతకుడి అత్యాచారం సంచలనం సృష్టించింది. తెల్లవారు నాలుగు గంటల సమయంలో మంచంపై పాప కనపడలేదు. తండ్రి.. నాయనమ్మ వేతుకుతుండగా గోలీలపేట ప్రాంతం చివరలో పాప కనిపించిందని తీసుకొచ్చి ఓ యువకుడు అప్పగించాడు.

వెంటనే జిజిహెచ్ కి తరలించారు. పాప కు బ్లీడింగ్ అవుతున్నా మెచ్యూర్ కాలేదు అని చెప్పి వైద్యం నిరాకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి కన్నబాబు ఆరా తీసారు.